Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసు బస్సు తాళాలు లాక్కెళ్లిన మహిళ.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత!

Woman activist snatches police bus keys at Jantar Mantar tension prevails
Advertisement
  • ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన
  • పోలీసు బస్సు తాళాలు లాక్కెళ్లిన మహిళ
  • ఆందోళనకారుల తరలింపును అడ్డుకున్న వైనం
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • మహిళ చర్యపై మిశ్రమ స్పందనలు
Advertisement
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న ఓ మహిళా కార్యకర్త చేసిన సాహసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సు తాళం చెవిని ఆమె లాక్కొని, వాహనం కదలకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓటర్ల జాబితా (ఎలక్టోరల్ రోల్) సవరణలు, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన  పలు డిమాండ్లతో ఢిల్లీలో కొందరు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించి, పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సులో ఎక్కించి అక్కడి నుంచి తరలించేందుకు సిద్ధమవుతుండగా, ఓ మహిళ ఒక్కసారిగా డ్రైవర్ వద్దకు వెళ్లి తాళం చెవిని లాక్కున్నారు.

ఆ వెంటనే ఆమె జనం మధ్యలోకి వెళ్ళిపోవడంతో బస్సు ముందుకు కదలలేదు. తాళం చెవి కోసం కొందరు ఆమెను వెంబడించినా ఫలితం లేకపోయింది. ఈ అనూహ్య పరిణామం అంతా కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె తెగువను కొందరు ప్రశంసిస్తుండగా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైంది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement
Woman activist
Jantar Mantar protest
Delhi police bus keys
Electoral roll protest Delhi

More Telugu News